Aishwarya Rai | బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, పారిస్ ఫ్యాషన్ వీక్ వంటి ప్రపంచ వేదికగా జరిగే ఫ్యాషన్ షోలకు కొత్త కళను తెస్తుంటుంది ఈ నీలి కళ్ల సుందరి. ఆయా వేడుకల్లో రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకుంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి.
తాజాగా ఐశ్వర్య పారిస్ ఫ్యాషన్ వీక్ (Paris Fashion Week)లో సందడి చేసింది. ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో హొయలు పోయింది. ట్రెండీ లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రేక్షకులకు కన్ను కొడుతూ, ఫ్లైయింగ్ కిస్‌తో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్యతో పాటు ఆమె మేన కోడలు నవ్య నవేలీ నంద (Navya Naveli Nanda) కూడా పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది. నవ్య మొదటిసారి ఈ షోలో పాల్గొంది. రెడ్ డ్రెస్‌లో ర్యాంప్‌పై వాక్ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Good morning to pariswarya and pariswarya only!pic.twitter.com/7w9RccEYeB
— grathie lethbian (@silamsiva) October 1, 2023
Also Read..
Ileana DCruz | అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా.. అప్పుడే రెండు నెలలైందంటూ పోస్ట్
Elon Musk | మీకిది సిగ్గుచేటు.. కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మస్క్ మండిపాటు