Ileana DCruz | ప్రముఖ నటి ఇలియానా (Ileana DCruz) ఇటీవలే తల్లైన విషయం తెలిసిందే. అక్టోబర్ 1వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబుకు కోవా ఫీనిక్స్ డోలన్ (Koa Pheonix Dolan) అని పేరు పెట్టి అభిమానులకు పరిచయం చేసింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది. ఈ సందర్భంగా తన కుమారుడి ఫొటోను గోవా బ్యూటీ తాజాగా షేర్ చేసింది. బాబు తన భుజంపై పడుకొని ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘అప్పుడే రెండు నెలలైంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. అయితే, ఇలియానా పెళ్లి కాకుండానే తల్లికావడం గమనార్హం.
ఇలియానా తాను ప్రెగ్నెంట్ అంటూ ఈ ఏడాది ఏప్రిల్‌లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన అందరినీ షాక్‌కు గురి చేసింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా పంచుకుంది. అయితే, తన పార్ట్నర్ ఎవరో మాత్రం వెల్లడించలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు బాయ్‌ఫ్రెండ్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. తాను కష్టంలో ఉన్న సమయంలో అతడు తోడుగా నిలిచాడని సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది. అయితే, బాయ్ ఫ్రెండ్ పేరు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. మిచల్ డోలన్ (Michael Dolan) అనే వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. దీనిపై క్లారిటీ లేదు. దేవదాస్ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ.. 2018లో వచ్చిన రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చివరిసారిగా తెలుగుతెరపై కనిపింది. ఇక బాలీవుడ్లో2021లో అభిషేక్ బచ్చన్ నటించిన బిగ్‌బుల్‌లో కనిపించింది.
Also Read..
Elon Musk | మీకిది సిగ్గుచేటు.. కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మస్క్ మండిపాటు
Hrithik Roshan | ప్రియురాలి నటనకి మురిసిపోతున్న స్టార్ హీరో