Hrithik Roshan | బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్ పరస్పర అంగీకారంతో 2014లో సుసానే ఖాన్ (Susane Khan) నుంచి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటి సబా ఆజాద్ (Saba Azad)తో ఆయనకు పరిచయం ఏర్పడింది. వీరు కొంతకాలంగా కలిసి వుంటున్నారు. బాలీవుడ్లో జరిగిన పలు పార్టీలు, డిన్నర్ డేట్స్‌కు వీరిద్దరూ కలిసి హాజరవుతున్నారు. నీతా అంబానీ (Neeta Ambani) ఏర్పాటు చేసిన ఓ పార్టీలో భాగంగా హృతిక్.. సబా చెప్పులను చేత్తో పట్టుకుని కనిపించడం గతంలో నెట్టింట వైరల్‌గా మారింది. వీరిద్దరి రిలేషన్ ఓపెన్ సీక్రెట్.
ఇదిలా ఉంటే.. తాజాగా తన ప్రియురాలు సబా ఆజాద్ నటించిన ఓ వెబ్ షో చూసి పొగడ్తల వర్షం కురుపించాడు హృతిక్. సబా ప్రధాన పాత్రలో నటించిన హూజ్ యువర్ గైనక్ (Who’s Your Gynac?) వెబ్ సిరిస్ అమోజన్ మినీ టీవీ(Amazon Mini tv)లో విడుదలైయింది. ఈ వెబ్ సిరిస్‌లో సబా నటనకు ఫిదా అయిపోయాడు హృతిక్. ”సిరిస్ అద్భుతంగా వుంది. ప్రతి ఎపిసోడ్‌ని ఎంజాయ్ చేశాను. ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. ముఖ్యంగా సబా.. అమేజింగ్. ఈ సిరిస్ చేసినందుకు తను గర్వపడాలి’ అని తన సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు హృతిక్. అటు సబా కూడా హృతిక్ పోస్ట్‌ను లవ్ సింబల్‌తో షేర్ చేస్తూ ప్రేమ వర్షం కురిపించింది. గత కొన్నాళ్ళుగా కలసి వుంటున్న ఈ ప్రేమ జంట త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.