ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తులైనా, సంస్థలైనా.. అనుమతి లేకుండా తన ఫొటోలను, పేరును ఉపయోగించేందుకు వీలులేకుండా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును కోరారు. ఈ వ్యవహారంపై విచారించిన కోర్టు.. అనుమతి లేనిదే ఏ సంస్థ అయినా.. వ్యక్తులైనా.. ఐశ్వర్య పేరు, ఫొటోలను ఉపయోగించకుండా తాత్కాలిక ఉత్తర్వులను జారీ చేశామని తెలిపింది.
ఐశ్వర్యరాయ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు వ్యక్తులు ఉపయోగించుకుంటున్నారని, ఆమె ఫొటోలను టీ షర్టులపై ముద్రించి వ్యాపారం చేస్తున్నారని ఐశ్వర్యరాయ్ తరపు న్యాయవాది సందీప్ సేథి కోర్టుకి వివరించారు.
కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఏఐతో ఐశ్వర్య చిత్రాలను క్రియేట్చేసి, అసభ్యకర వీడియోలను తమ ఛానల్స్‌లో అప్లోడ్ చేస్తున్నారంటూ దానికి సంబంధించిన ఆధారాలను కూడా సందీప్ సేథి కోర్టుకు సమర్పించారు. ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే ఏడాది జనవరి 15న జరుగనున్నది.