Rahul Sipligunj |టాలీవుడ్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ఇటీవల .. రాహుల్, హరిణ్య అనే యువతితో అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ వేడుక జరుపుకున్నాడు. ఈ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు కేవలం సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరు కాగా, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇక ఇప్పుడు రాహుల్ పెళ్లి పనులు మొదలైనట్టు తెలుస్తుంది. హరిణ్య తన సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేయగా, ఇందులో హరిణ్యకి రాహుల్ ముద్దు పెట్టడం, జడ లాగడం, పసుపు దంచడం వంటివి చేస్తున్నాడు. లగ్న పత్రిక కార్యక్రమం జరిగిందని చెబుతూ ఈ ఫొటోలు షేర్ చేసింది హరిణ్య. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తుంది.
ఇక ప్రైవేట్ సాంగ్స్‌తో యూత్‌లో సెన్సేషన్‌గా మారిన రాహుల్ సిప్లిగంజ్, ఆ తర్వాత టాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మాస్ బీట్లకు రాహుల్ వాయిస్ బాగా సూట్ అవుతుంది. రెండు సంవత్సరాల క్రితం విడుదలైన రాజమౌళి దర్శకత్వంలోని ఆర్ఆర్ఆర్ సినిమాలో “నాటు నాటు” పాటతో ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. ఈ పాట ఆయనను ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన గాయకుడిగా నిలిపింది. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో, రాహుల్ సిప్లిగంజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది.
ఆస్కార్ వేదికపై పాట పాడి దేశం గర్వించేటట్లు చేసిన రాహుల్‌ను 2023లో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సత్కరించి రూ.10 లక్షల ప్రోత్సాహకం అందించారు. అనంతరం సీఎం అయిన తర్వాత తన మాట నిలబెట్టుకుని, రాహుల్‌కు రూ.1 కోటి రూపాయల బహుమతి చెక్కును అందజేశారు. ఈ ఘనత రాహుల్ కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. తెలంగాణ సొగసు, భాషా స్వరూపం కలగలిపిన పాటలతో రాహుల్ తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. “రేవంత్ రెడ్డి కాలింగ్”, “గల్లీ కా గణేష్” వంటి పాటలు యువతలో విపరీతంగా పాపులర్ అయ్యాయి. ఇప్పుడు ఆయన జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా విజయవంతం కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.