‘పూణెలో తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే.. హైదరాబాద్‌లో రాజమౌళి నాకు పేరునిచ్చారు. వారివల్లే ఈ రోజు ఓ సినిమాను నిర్మించే స్థాయికి రాగలిగాను. ఇందులో నేనే హీరో. ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. ఇన్నాళ్లూ నన్ను విలన్‌గా చూశారు. త్వరలో హీరోగా సర్ప్రైజ్ ఇవ్వనున్నా. విజన్ ఉన్న దర్శకుడు త్రికోటి. ప్రమోషన్స్ స్టార్ట్ చేశాం.
విజయం ఇస్తారని ఆశిస్తున్నా’ అన్నారు దేవ్‌గిల్. ఆయన హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘అహో! విక్రమార్క’. గురువారం ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు త్రికోటి మాట్లాడుతూ ‘మగధీర’ నుంచి దేవ్‌గిల్ పరిచయం. ఎప్పట్నుంచో ఇద్దరం సినిమా చేద్దామనుకుంటున్నాం.
ఆయనకు ఎలాంటి కథ అయితే బాగుంటుందని ఆలోచించా. చివరకు పోలీస్ కథతో ఈ సినిమా చేశాం. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు. ఇంకా దేవ్‌గిల్ భార్య, నిర్మాత ఆర్తి, నటులు యువరాజ్, ప్రవీణ్, నటి చిత్రాశుక్లా కూడా మాట్లారు.