‘ఆహా’లో స్ట్రీమింగ్ అయిన ‘గీతా సుబ్రహ్మణ్యం’ వెబ్‌సిరీస్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. చక్కటి ప్రేమకథగా మెప్పించింది. ఈ సిరీస్ మూడో సీజన్ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు శివసాయి వర్ధన్ మాట్లాడుతూ ‘ప్రేమజంట మధ్య చోటుచేసుకునే చిన్న గొడవలు, మనస్పర్థల నేపథ్యంలో ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సిరీస్ సాగుతుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ జీవితాన్ని బిజీగా గడిపే గీతా, సుబ్బు ఓ ప్రాజెక్ట్ కోసం ఎంపికవుతారు. అందులో ఉద్యోగులు ఎలాంటి రిలేషన్లో ఉండకూడదని కండిషన్ పెడతారు. కానీ ఆ కండీషన్‌ను గీతా, సుబ్బు బ్రేక్ చేస్తారు. ఈ క్రమంలో ఏం జరిగిందన్నది చక్కటి వినోదాన్ని పంచుతుంది’ అన్నారు.