Anil Sunkara Interview | ఏజెంట్ అఖిల్ కెరీర్లో కొత్త స్టాండర్డ్‌ని సెట్ చేస్తుంది.. నిర్మాత అనిల్ సుంకర ఇంటర్వ్యూ
Agent | అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేందర్ 2 సినిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఏజెంట్ సినిమా విశేషాలను నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఏజెంట్ విశేషాలు ఆయన మాటల్లోనే..
Agent | టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ ఏజెంట్ (Agent). సురేందర్ రెడ్డి (Surenderreddy) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సురేందర్ 2 సినిమాతో కలిసి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, మలయాళంతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత అనిల్ సుంకర (Anil Sunkara) ఏజెంట్ సినిమా విశేషాలను అందరితో పంచుకున్నారు. ఏజెంట్ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఏజెంట్ రిలీజవుతుండటం ఎక్జయిటింగ్‌గా ఉందా..? నర్వస్‌గా ఫీలవుతున్నారా..?
నిజాయితీగా చెప్పాలంటే.. నా మీద చాలా ఒత్తిడి ఉంది. ఇది సినిమా ఫలితం వల్ల కాదు. గత 30 రోజులు సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరూ రాత్రి, పగలూ కష్టపడుతున్నారు. సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా వర్క్ నడుస్తూనే ఉంది.
ఏజెంట్ టార్గెట్ చేరుకుంటాడని నమ్మకముందా..?
ప్రపంచం మొత్తంలో ఎవరూ అలా చెప్పలేరు. నేను ఈ సినిమా అఖిల్ కెరీర్లో కొత్త స్టాండర్డ్‌ని సెట్ చేస్తుందని మాత్రం చెప్పగలను. అఖిల్ కెరీర్ ఏజెంట్‌కి ముందు ఏజెంట్ తర్వాత అని మాట్లాడుకుంటారని మాత్రం చెప్పగలను.
ఏజెంట్లో ఫన్నీ ఎలిమెంట్స్ ఉంటాయా..?
అఖిల్ పాత్ర వినోదాత్మకంగా ఉంటుంది. హీరో చేసే పనిని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఆ పాత్రకు జాకీ చాన్‌తో ఎలాంటి కనెక్షన్ ఉండదు. కానీ చమత్కారమైన కామెడీ ఉంటుంది.
సినిమా మొదలుపెట్టే ముందు హీరో మార్కెట్ గురించి ఆలోచిస్తారా..?
ఇది సాధారణంగా కమర్షియల్ సినిమా. కాబట్టి కొన్ని లెక్కలుంటాయి. కానీ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఏజెంట్ విషయానికొస్తే మేం ఊహించిన దాని కంటే ఎక్కువ బిజినెస్ చేశాం.
పెద్ద సినిమాలు..చిన్న సినిమాలు.. వీటిలో ఏవి సౌకర్యంగా అనిపిస్తాయి..?
ఇది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమా చేయడం మంచిది. ఒకవేళ భారీ బడ్జెట్ సినిమా అయితే.. ఆ సినిమా హిట్టయితే బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. ఆర్థికంగా చూస్తే చిన్ని సినిమాల్లో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్ని సినిమాలు, పెద్ద సినిమాల విషయంలో వేటి లాభనష్టాలు వాటికుంటాయి.
Read Also :
Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ నయా అప్డేట్
VS 11 | కోరమీసంతో విశ్వక్ సేన్.. కొత్త సినిమా VS 11 లాంఛ్
Samantha | సమంతకు సరికొత్త కానుక సిద్ధం చేసిన అభిమాని.. ఏకంగా ఇంట్లోనే గుడి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

