Republic | శివగామిని మించిపోయే క్యారెక్టర్ చేస్తున్న రమ్యకృష్ణ

Republic | కొందరు హీరోయిన్లకు వయసు అవుతుందేమో కానీ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈమె కూడా ఇప్పటికీ అదే దూకుడు చూపిస్తుంది. 50 ఏళ్ల వయసులో కూడా కుర్ర భామలతో పోటీ పడుతుంది. సినిమాకు కోటికి పైగా పారితోషికం అందుకుంటూ ఔరా అనిపిస్తుంది రమ్యకృష్ణ. అంతేకాదు ఒకప్పుడు ఈమె చేయని సాహసం అంటూ లేదు. దేవతగా దండాలు పెట్టించుకుంది.. బికినీ వేసి మతి పోగొట్టింది. అన్ని రకాల పాత్రలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిల్చుంది రమ్యకృష్ణ. ఇప్పటికీ అదే స్టార్ డమ్ ఎంజాయ్ చేస్తుంది. వయసుకు తగ్గ పాత్రలు చేస్తూనే.. అప్పుడప్పుడూ సంచలన పాత్రలకు కూడా ఓకే చెప్తుంది ఈ సీనియర్ హీరోయిన్.
బాహుబలిలో రమ్యకృష్ణ చేసిన శివగామి పాత్రతో ఇండియన్ వైడ్‌గా స్టార్ అయిపోయింది. నటిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న ఈమె.. కథ నచ్చితే బోల్డ్ కారెక్టర్స్ కూడా చేస్తుంది. ఇప్పటికే రెండేళ్ల కింద తమిళనాట సూపర్ డీలక్స్ సినిమాలో అదిరిపోయే కారెక్టర్ చేసింది రమ్యకృష్ణ. దానికి ముందు మలయాళంలో కూడా బోల్డ్ రోల్ చేసింది. కథ డిమాండ్ చేస్తే ఇప్పటికీ గ్లామర్ కారెక్టర్ చేయడానికి తనకేం అభ్యంతరం లేదంటూ హింట్స్ ఇస్తుంది ఈ సీనియర్ హీరోయిన్. పాత్రకు న్యాయం చేయడానికి దేనికైనా రెడీ అంటుంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న రిపబ్లిక్ సినిమాలో అదిరిపోయే పాత్ర చేస్తుంది రమ్యకృష్ణ. దేవా కట్టా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో హీరో కంటే పవర్ ఫుల్ పాత్ర చేస్తుంది రమ్యకృష్ణ. నీలాంబరి, శివగామి తర్వాత అలా నిలిచిపోయే పాత్ర రిపబ్లిక్ లో చేస్తుంది రమ్యకృష్ణ. ఈ సినిమాను కచ్చితంగా ఆమె డామినేట్ చేస్తుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. బాహుబలి తర్వాత ఒక్కో సినిమాకు కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పారితోషికం అందుకుంటుంది. మొత్తానికి కేవలం అమ్మ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు విరుచుకుపడే విలన్ గా అదరగొడుతుంది రమ్యకృష్ణ.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Bigg boss: పండగ రోజు చల్లారని మంట..!
Roja: రోజా కూతురి బర్త్ డే .. వైరల్‌గా మారిన ఫొటోలు
Chiranjeevi: మెగాస్టార్ ఇంటి వినాయకుడిని చూశారా..!
Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

