Love Story: లవ్ స్టోరీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలలో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం లవ్ స్టోరీ. ఫిదా మాదిరిగానే ఈ చిత్రం కూడా తెలంగాణలో జరిగే ఒక అందమైన ప్రేమకథ. భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే బరువైన కథ. ఫస్టులుక్ పోస్టర్ దగ్గర నుంచి ఈ సినిమా యూత్ లో ఆసక్తిని పెంచుతూ వస్తోంది. కరోనా వలన ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.
ఎట్టకేలకు వినాయక చవితి పండుగ సందర్భంగా మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. కొన్ని కారణాల వలన చిత్రం వాయిదా వేయాల్సి వచ్చిందని, సెప్టెంబర్ 24న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుందని ప్రకటించారు. ఇక అభిమానులు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసేందుకు సిద్ధం కండి.
ఈ సినిమా నుండి వచ్చిన ‘సారంగధరియా’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాట, జానపద కథ అయిన ‘సారంగధరుడు’ నుంచి వచ్చిందనే చెప్పొచ్చు. సారంగదరియా పాట సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సీనియర్ హీరోయిన్ దేవయాని కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, రావు రమేశ్ .. పోసాని ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | ఏపీలో అర్నబ్ బీభత్సం.. పలు జిల్లాలో ఏడుగురు మృతి
ACB Net | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ లీగల్ మెట్రోలజీ ఇన్స్పెక్టర్
MLA Dr. Sanjay | గోదావరి పుష్కరాల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్
Transport Department | వాహన దారులకు పారదర్శక సేవలు : రవాణా శాఖ
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

