Kriti Sanon | నటిగా 12 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది సమంత. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందులో మనం లాంటి క్లాసిక్ చిత్రాలూ ఉన్నాయి. ఇవన్నీ కాదని ఆమెను ఈ మధ్య ఊ ఉంటావా స్టార్ అని పిలుస్తున్నారు. ఈ ఒకే ఒక్క పాట అంత పెద్ద హీరోయిన్ ఇమేజ్ మార్చేసింది. పాటనే గుర్తింపుగా అందించింది. ఈ విషయంపై సమంత కూడా స్పందిస్తూ..నా సినిమాలన్నీ మర్చిపోయారు, ఊ అంటావా పాటొక్కటే గుర్తుపెట్టుకున్నారు అని చెప్పింది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలోని పుష్ప ద రైజ్ చిత్రంలోని ఈ పాట అంత పాపులర్ అయ్యింది.
ఈ సినిమా సెకండ్ పార్ట్ పుష్ప ద రూల్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ రూపొందిస్తారట. ఈ పాటలో బాలీవుడ్ తార కృతి సనన్ ఆడిపాడనుందని సమాచారం. తొలిభాగంలో సమంత తీసుకున్న మాస్ సాంగ్ బాధ్యత ఈ సారి బాలీవుడ్ భామ తీసుకోనుంది. ఊ అంటావా పాట సమంతకే కాదు సినిమాకూ చాలా పాపులారిటీ తీసుకొచ్చింది. ప్రతి పాటను ఆయా భాషల్లో మా పాటే అనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం. అందుకే ఈ రిజల్ట్ అంటారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.
పుష్ప మొదటి భాగం సినిమాకు బాలీవుడ్లో అనూహ్యమైన స్పందన వచ్చింది. వందకోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. దీంతో ఈ సినిమా స్పెషల్ సాంగ్ అంటే బాలీవుడ్ తారలు తేలిగ్గా తీసుకోకపోవచ్చు. కృతి సనన్ పుష్పలో ఆడిపాడటం అసాధ్యమైతే కాదు. కానీ అన్నీ కుదరాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు అక్కడ స్టార్ హీరోయిన్. కృతి స్పెషల్ సాంగ్ చేస్తే ఆ పాటకు పాన్ ఇండియా అప్పీయరెన్స్ రావడం ఖాయం.