Cinema News | ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ ఆప్ కే హై కౌన్’తోపాటు ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి అత్యంత విజయవంతమైన చిత్రాలు అందించిన దర్శక-నట ద్వయం సూరజ్ భర్జాత్యా, సల్మాన్ ఖాన్. ఈ కాంబోలో మరో సినిమా రానుంది. 2015లో వచ్చిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వీరిద్దరి కాంబినేషన్లో చివరి సినిమా.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. భారీస్థాయిలో తెరకెక్కించనున్న ఈ ప్రాజెక్టు కోసం సల్మాన్ 26 నెలలు డేట్స్ ఇచ్చినట్టుగా బాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ కానీ, మిగతా నటీనటుల గురించి కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇదిలా ఉండగా, కరణ్ జోహార్ రూపొందిస్తున్న ఓ చిత్రంతోపాటు మరికొన్ని సినిమాలు సల్మాన్ చేతిలో ఉన్నాయి.