AK61 Movie | 11 ఏళ్ళ తర్వాత నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజిత్..!
Ajith in Negative Role | తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న నటుడు అజిత్. ఈ ఏడాది 'వలిమై'తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. అదే జోష్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి.
Ajith in Negative Role | తమిళంతో పాటు తెలుగులోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న నటుడు అజిత్. ఈ ఏడాది ‘వలిమై’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. అదే జోష్‌తో వరుసగా సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకుంటుంది. కాగా మేకర్స్ ఇప్పటినుండే అజిత్ పోస్టర్లను విడుదల చేస్తూ సినిమాపై విపరీతమైన బజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ చిత్రంలో అజిత్ నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తుంది. ‘గ్యాంబ్లర్’ తర్వాత మళ్ళీ 11ఏళ్ళకు నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిలిం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తునివు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో అజిత్‌కు జోడీగా మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తుంది. సుముద్రఖని కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Read Also:
Thalivu Movie | ‘AK61’ సెకండ్ పోస్టర్ రిలీజ్.. మాస్ లుక్‌లో అదరగొడుతున్న అజిత్
Rajinikanth | షారుఖ్ ‘జవాన్’లో సూపర్‌స్టార్ రజినీకాంత్?
Alia Bhatt | బ్రహ్మాస్త్ర-2లో ఈ స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్న అలియాభట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

