Trivikram Srinivas | పవన్ కళ్యాణ్ కోసం రూట్ మారుస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
Trivikram Srinivas | తెలుగు ఇండస్ట్రీలో అగ్ర దర్శకుల జాబితా చూసుకుంటే అందులో త్రివిక్రమ్ ముందు వరుసలో ఉంటాడు. ఈయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులకు ఫేవరేట్‌గా నిలిచాయి. ఖలేజా సినిమా ఫ్లాప్ అయినా కూడా చాలా మందికి అది హాట్ ఫేవరేట్. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది ఖలేజా. దానికి ముందు మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కించిన అతడు సినిమా కూడా అంతే. థియేటర్లలో ఆ సినిమా భారీ లాభాలు తీసుకురాకపోయినా.. బుల్లితెరపై మరే తెలుగు సినిమాకు సాధ్యం కాని రికార్డులు సృష్టించింది.
తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందించాడు గురూజీ. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమా కోసం ఆయన 14 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక మహేశ్ బాబుతో దర్శకుడిగా ఆయన చేస్తున్న సినిమా కోసం 40 కోట్లకు పైగానే తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం ఈయన క్రేజ్ అంతగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా పవన్ నటించబోయే మరో రెండు సినిమాలకు కూడా మాటలు, స్క్రీన్ ప్లే అందించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ విషయమై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

సాయి ధరమ్ తేజ్, పవన్ కాంబినేషన్లో రాబోయే రీమేక్ కోసం కూడా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పైగా ఈ సినిమా కోసం పారితోషికంగా 20 కోట్ల వరకు అందుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. దాంతో పాటు మరో సొంత కథ కూడా పవన్ కోసం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది. దీనికి కూడా 20 కోట్ల వరకు పారితోషికం అందుకోబోతున్నాడు మాటల మాంత్రికుడు. తన స్నేహితుడి కోసం ఓ మెట్టు దిగి కథకుడిగా మారుతున్నాడు త్రివిక్రమ్. మొత్తానికి ఓ వైపు దర్శకుడిగానే కాకుండా.. కథకుడిగానూ సంపాదిస్తున్నాడు త్రివిక్రమ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

