Sebastian p.c 524 | ‘రాజావారు రాణిగారు’, ‘SR కళ్యాణమండపం’ వంటి వరుస హిట్ల తరువాత కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘సెబాస్టియన్ పి.సి 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు హీరో అడివిశేష్, ఆకాష్‌పూరి, దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, నటుడు సప్తగిరితో పాటు తదితరులు అతిథులుగా వచ్చారు. ఈ వేడుకలో అడివిశేష్ మాట్లాడుతూ ‘నేను లాస్ట్ ఇయర్ ఈ కథ విన్నాను. బాగుంది, కొత్తగా ఉంది చేసేద్దాం అనుకున్నాను. కాని మేకర్స్ అప్పటికే కిరణ్ చేస్తున్నాడు అని చెప్పారు’ అంటూ వెల్లడించాడు.
ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం రే చీకటి గల పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ట్రైలర్లతో సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి. జోవితా సినిమాస్ బ్యానర్‌పై సిద్ధారెడ్డి, రాజు, ప్రమోద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కిరణ్‌కు జోడిగా నువేక్ష హీరోయిన్గా నటిస్తుంది. జిబ్రాన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం గత శుక్రవారం విడుదల కావాల్సి ఉంది.కానీ అదే రోజున ‘భీమ్లానాయక్’ విడుదలవడంతో ఈ చిత్రాన్ని మార్చి 4వ తేదీకి మేకర్స్ పోస్ట్ పోన్ చేశారు.