Dacoit | టాలీవుడ్ హీరో అడివిశేష్ (Adivi Sesh), మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం డెకాయిట్ (Dacoit). షనీల్ డియో కథనందిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ముందుగా వచ్చిన వార్తల ప్రకారం క్రిస్మస్కు ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. అయితే ఎవరూ ఊహించని విధంగా కొత్త తేదీ ప్రకటిస్తామంటూ తెలిపారు మేకర్స్.
ఈ మూవీని ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. అడివి శేష్, మృణాళ్ ఠాకూర్ జీప్‌లో ఉండగా.. ఈ ఇద్దరూ గన్‌తో శత్రువులను ఎదుర్కొంటూ తమను తాము రక్షించుకుంటున్న కొత్త పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ మూవీని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా.. సునీల్ నారంగ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. అడివిశేష్ హీరోగా నటించిన క్షణం, గూఢచారి చిత్రాలకు సినిమాటోగ్రఫర్‌గా పనిచేసిన షనీల్ డియో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.
This UGADI 2026, EXperience EXplosive drama with #DACOIT ❤🔥
GRAND RELEASE WORLDWIDE ON MARCH 19th, 2026 in Telugu & Hindi 💥#UgadiWithDACOIT#GudiPadwaWithDACOIT#EidWithDACOIT@AdiviSesh @mrunal0801 @anuragkashyap72 @Deonidas #BheemsCeciroleo @Gyaani_official… pic.twitter.com/TFNzff4Xbx
— BA Raju’s Team (@baraju_SuperHit) October 28, 2025
Nagadurg Debut | ధనుష్ మేనల్లుడి సినిమాలో హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ!
The Family Man S3 | ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ అనౌన్స్మెంట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.!