Aditya Om | లాహిరి లాహిరి లాహిరి సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశాడు ఆదిత్య ఓం (Aditya Om). ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ యాక్టర్ 2023లో నాతో నేను సినిమాలో కీలక పాత్రలో నటించాడు. 2024లో పాపులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో కూడా సందడి చేశాడు. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కూడా అయిన ఈ నటుడు ప్రస్తుతం బంధీ (Bandi) సినిమాలో నటిస్తున్నాడు.
ఈ మూవీలో ప్రకృతిని నాశనం చేస్తున్న కార్పొరేట్ కంపెనీలకు మద్దతుగా నిలిచే పాత్రలో ఆదిత్య ఓం కనిపించనున్నాడు. కార్పోరేట్ కంపెనీలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించే పాత్రను పోషిస్తుండగా.. అతడిని అడవిలో వదిలేస్తే ఏం జరుగుతుంది..? అతడు ప్రకృతిని ఎలా కాపాడుతాడనే కాన్సెప్ట్‌తో సినిమా ఆసక్తికరంగా ఉండబోతుందని మేకర్స్ వెల్లడించారు. ఆదిత్య ఓం ఈ సినిమాలో ఎలాంటి డూప్స్ లేకుండా సొంతంగా యాక్షన్ సీక్వెన్స్‌లో కనిపించబోతున్నారని తెలియజేశారు.
ఈ చిత్రానికి తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నాడు. గల్లీ సినిమా బ్యానర్‌పై వెంకటేశ్వర్ రావు దగ్గు, తిరుమల రఘు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
బంధీ ట్రైలర్..
Bachchala Malli | అల్లరి నరేశ్ బచ్చలమల్లిని థియేటర్లలో మిస్సయ్యారా..? ఈ వార్త మీ కోసమే..
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్