Adi Reddy | బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ద్వారా పాపులారిటీ సంపాదించిన కామన్ మ్యాన్ ఆది రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ ఫేమస్ అయిన ఆదిరెడ్డి బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని తన ఆట, మాటతీరుతో బుల్లితెర ఆడియెన్స్ మనసులు గెల్చుకున్నాడు. ఫైనల్ వరకు వెళ్లి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనదైన శైలిలో బిగ్ బాస్ షో రివ్యూలు చెబుతూ తన పాపులారిటీ మరింత పెంచుకున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ తో పాటు సినిమాలపైనా కూడా తన అభిప్రాయాలు చెబుతున్నాడు. అలాగే కొన్ని టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నాడు.
తన యూట్యూబ్‌లో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు రూపొందిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఆదిరెడ్డి కొద్ది రోజుల క్రితం తన ఫాలో వర్స్ కు ఒక శుభవార్త చెప్పాడు. తాను రెండోసారి తండ్రి కాబోతున్నట్లు తెలిపాడు.అంతేకాకుండా తన భార్యకి గ్రాండ్ గా సీమంతం కూడా నిర్వహించాడు. ఈ వేడుకలో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆది రెడ్డి.. ‘నా సీత సీమంతం’ అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఇక తాజాగా తన భార్య పండంటి అమ్మాయికి జన్మనిచ్చిందని తెలిపారు.
డాక్టర్ చేతుల మీదుగా తన కూతురిని తీసుకుంటున్న హృద్యమైన వీడియోను ఆదిరెడ్డి తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేస్తూ, మరోసారి మహాలక్ష్మి పుట్టిందంటూ అంటూ భావోద్వేగంగా పోస్ట్ చేశారు. ఆదిరెడ్డి పోస్టు చేసిన వీడియోకి నెటిజన్లతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అతనికి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ విషెస్ వెల్లువలా కురిపిస్తున్నారు.ఇప్పటికే ఒక పాపకి తండ్రిగా ఉన్న ఆదిరెడ్డి, ఇప్పుడు రెండో సారి తండ్రిగా మారాడు. కాగా, ఆది రెడ్డి బిగ్ బాస్ షో తర్వాత టీవీ కార్యక్రమాలు, యూట్యూబ్ కంటెంట్, మరియు ఇతర వాణిజ్య కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటూ బిజినెస్ రంగంలో కూడా స్థిరపడ్డాడు. బిగ్ బాస్ ద్వారా వచ్చిన ఫేమ్‌ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాడు ఆదిరెడ్డి.