e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home News లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!

లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!

లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!

న‌టుడిగా, ద‌ర్శ‌కుడిగా, కొరియోగ్రాఫ‌ర్‌గా, నిర్మాత‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న లారెన్స్ న‌టుడిగా విభిన్న క‌థాచిత్రాల‌తో మెప్పిస్తున్నారు. తాజాగా ఆయ‌న దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ‘అధిగారం’ అనే టైటిల్‌తో రూపొందుతున్న‌ ఈ చిత్రానికి డైరెక్టర్ వెట్రిమారన్ కథ, మాట‌లు అందించడం జరిగింది. వెట్రిమారన్ సినిమా అంటే వ‌యోలెన్స్, రివేంజ్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు .

తాజాగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఈ సినిమా ప‌క్కా రివెంజ్ డ్రామాగా ఉంటుంద‌ని అర్ద‌మ‌వుతుంది. లారెన్స్ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. ఈ ఏడాది చివర్లో మలేషియాలో షూటింగ్ మొదలుకానుంది. 50 రోజుల పాటు అక్కడే షూటింగ్ చేయనున్నారు. అనంతరం ఇండియాలోని పలు లోకేషన్లలో చిత్రీకరణ జరుపుతారట. సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజులలో వెల్ల‌డించ‌నున్నారు.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!
లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!
లారెన్స్‌తో వెట్రిమారన్.. ఫ‌స్ట్ లుక్ అదిరిందిగా..!

ట్రెండింగ్‌

Advertisement