The Kerala Story | మరోసారి వార్తల్లోకి అదా శర్మ ది కేరళ స్టోరీ.. ఇంతకీ విషయమేంటంటే..?
The Kerala Story | సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వంలో పాపులర్ నటి అదా శర్మ (Adah sharma) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). 2023 మే 5న విడుదల ఈ చిత్రం వివాదాల మధ్యే సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.
The Kerala Story | పాపులర్ నటి అదా శర్మ (Adah sharma) లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story). హిజాబ్, లవ్ జిహాద్ చుట్టూ తిరిగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి సుదీప్తో సేన్ (Sudipto Sen) దర్శకత్వం వహించారు. లవ్ జిహాద్ ద్వారా కేరళకు చెందిన 32 వేల మందిని ముస్లిం మతంలోకి మార్చి, సిరియాకు తరలించారనే నేపథ్యంలో సాగే ఈ సినిమాను పలు వివాదాలు చుట్టుముట్టాయి. 2023 మే 5న విడుదల ఈ చిత్రం వివాదాల మధ్యే సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ మరోసారి వార్తల్లో నిలిచింది.
ది కేరళ స్టోరీని ప్రసారం చేయాలనే దూరదర్శన్ నిర్ణయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఖండించారు.
ఈ సినిమా లోక్‌సభ ఎన్నికలకు ముందు మత విద్వేషాలు, ఉద్రిక్తతలను మరింత తీవ్రతరం చేస్తుందని.. ఈ నేపథ్యంలో సినిమా ప్రసారాన్ని నిలిపేయాలని సీఎం విజయన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్‌ను కోరినట్లు తెలుస్తోంది. మరి దూరదర్శన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు.
సమాజంలో వర్గ విభేదాలు సృష్టించే లక్ష్యంతో నిర్మించిన వివాదాస్పద ‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప్రదర్శించడానికి వీలు లేదని అప్పట్లో కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా అలజడి సృష్టించిన చిత్రం ‘ది కేరళ స్టోరీ’ దక్షిణాదిలో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంలో సంఘ్ పరివార్ శక్తులు ఈ చిత్రాన్ని నిర్మించారని సీపీఎం , కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సినిమా ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశాయి.
Kerala Chief Minister Pinarayi Vijayan condemns Doordarshan’s decision to telecast #TheKeralaStory
Vijayan has reportedly asked the public broadcaster to withdraw from screening movie, saying it would only “exacerbate communal tensions” ahead of the Lok Sabha polls pic.twitter.com/oQpYTO8St6
— Organiser Weekly (@eOrganiser) April 5, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

