‘భూల్ భులయ్యా 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ భామ విద్యాబాలన్. కామెడీ హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రానికి యావరేజ్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం భారీగానే ఉన్నాయి. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ‘భూల్ భులయ్యా 3’ షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకుంది విద్యాబాలన్. ఆమె మాట్లాడుతూ- ‘మాధురీ దీక్షిత్ మేడమ్ గురించి ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. ఏజ్ అనేది ఆమెకు జస్ట్ నంబర్ అంతే.
నాకూ ఆమెకూ వయసు రిత్యా పన్నెండేళ్లు తేడా ఉంది. ఇందులో మేం అక్కాచెల్లెళ్లుగా నటించాం. స్క్రీన్‌పై ఆమె నా ఏజ్‌లో కనిపించారు. నాకంటే తను పుష్కరకాలం పెద్దదంటే ఎవరూ నమ్మరు. డాన్స్‌లో అయితే ఆమెతో పోటీ పడలేకపోయా. ఆమెను ప్రేరణగా తీసుకొని నటిగా మారిన వాళ్లలో నేనూ ఒకదాన్ని. ఆమెతో కలిసి నటించడం నిజంగా గర్వంగా ఉంది. ఇప్పటికీ వన్నె తరగని అందం, ఫిఫ్టీ ప్లస్‌లోనూ తొణకని నాట్య కౌశల్యం మాధురీ మేడమ్ సొంతం.’ అంటూ చెప్పుకొచ్చింది విద్యాబాలన్.