Subhashini | సినీ నటి సుభాషిణి (36)ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై పోరూరులోని అపార్ట్మెంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుభాషిణి స్వస్థలం శ్రీలంక కాగా.. బెంగళూరుకు చెందిన పిప్పిన్‌తో వివాహం జరిగింది. భర్త పిప్పిన్‌తో కలిసి బెంగళూరులో నివసించే సుభాషిణి షూటింగ్స్ కోసం చెన్నై పోరూరులో సింగిల్‌గా ఉంటోంది.
సుభాషిణి టీవీ సీరియల్ ‘కయల్’తోపాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. భర్తతో వీడియో కాల్లో వాగ్వాదం తర్వాత సుభాషిణి ఆత్మహత్య చేసుకుంది. కయల్ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుభాషిణి.. సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటుంది.
మంగళవారం రాత్రి భర్తతో వీడియో కాల్లో వాగ్వాదం జరగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుభాషిణి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Trisha | త్రిష సైలెంట్ రియాక్షన్ వైరల్ ..రాజకీయ వివాదాల మధ్య లవ్ కోట్స్‌తో సందేశం