Katrina Kaif | బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కర్నాటకలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సర్ప సంస్కార పూజల్లో పాల్గొన్నారు. కత్రినా మంగళవారం తన స్నేహితులతో కలిసి ఆలయానికి చేరుకొని.. సర్ప సంస్కార పూజల్లో పాల్గొనట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ పూజ రెండురోజుల పాటు సాగుతుంది. మంగళవారం జరిగిన పూజ.. బుధవారం కూడా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ పూజ దాదాపు నాలుగు గంటల నుంచి ఐదుగంటల పాటు కొనసాగుతుందని తెలిపారు. కత్రినా స్థానిక వీఐపీ అతిథి గృహంలోనే బస చేశారని చెప్పారు.
బుధవారం ఉదయం పూజలు ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటలకు పూర్తవుతుందని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆలయంలో సర్ప దోషం నివారణ కోసం భక్తులు ఇక్కడ సర్ప సంస్కారణ పూజలు చేస్తారు. ఈ పూజ రెండురోజులు ఉంటుంది. ఇందు కోసం ఆలయం వద్దే బస చేయాల్సి ఉంటుంది. పూజలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాత్రమే ఉంటుంది. సాయంత్రం ప్రత్యేక పూజలు ఉండవని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కత్రినా కైఫ్ ఇటీవల మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో జరిగిన కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానం చేశారు. ఆ తర్వాత పరమార్థ నికేతన్ ఆశ్రమం అధ్యక్షుడు స్వామి చిదానంద సరస్వతిని కలిసి.. ఆశీర్వాదం తీసుకున్నారు.