Geeta Singh | తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన లేడి కమెడియన్ గీతా సింగ్. ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషాదకర అనుభవాన్ని పంచుకున్నారు. సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన ఈ నటి… జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. గీతా సింగ్ మాట్లాడుతూ.. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానని తెలిపారు. ‘‘చనిపోవాలనిపించింది అంటూ ఆమె ఎమోషనల్‌గా పేర్కొన్నారు. నాకు తెలిసిన మహిళ దగ్గర 22 లక్షల రూపాయల వరకు చీటీ కట్టాను. ఓ సారి అవసరం వచ్చినప్పుడు డబ్బు అడిగితే, రెడీ చేస్తానని చెప్పింది. కానీ ఆ ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ సామాన్లు ఏమీ లేకపోవడం చూసి షాక్ అయ్యాను. అడిగితే ‘ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం అనిందీ… కానీ రాత్రికి రాత్రే పారిపోయింది అని చెప్పుకొచ్చారు.
ఈ మోసం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా… ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోందని, కానీ ఆ మహిళ ఏమాత్రం పట్టించుకోవడం లేదని గీతా వాపోయారు. రోజూ ఒక్కొక్క రూపాయి దాచుకుని వాళ్లకు ఇచ్చాను. మోసం చేశారు. ఆమెను చూస్తే కొట్టాలనిపిస్తుంది అంటూ తన ఆవేదనను వెల్లడించారు. సూసైడ్ చేసుకోవాలని అనుకున్న సమయంలో తన అక్క ఇచ్చిన మద్దతును గుర్తుచేసుకున్న గీతా . నా అక్క వచ్చి నన్ను తిట్టి, లైన్లో పెట్టింది. లేకపోతే బతికి ఉండేదానినే కాదేమో ’’ అని భావోద్వేగంతో చెప్పారు.
కొంతకాలం ఫ్యామిలీ ఇష్యూస్‌తో సినిమాలకు దూరంగా ఉన్న గీతా సింగ్ ఇప్పుడు మళ్లీ సినీ రంగంలో యాక్టివ్ అవుతున్నారు. తన టాలెంట్‌కు తగిన అవకాశాలు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. గీతా సింగ్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తన అన్న కొడుకుని దత్తత తీసుకొని పెంచింది. వయస్సుకి వచ్చిన అతడు యాక్సిడెంట్లో కన్నుమూసాడు. ఆ సమయంలో గీతా సింగ్ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇప్పటికీ తాను గుర్తొస్తుంటాడని, ఆ సమయంలో చాలా ఏడుస్తుంటానని గీతా సింగ్ పేర్కొన్నారు.