Actress Gautami | సీనియర్ నటి గౌతమి తన రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురైందని గ్రేటర్ చెన్నై పోలిసు కమిషనరు కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. కంచిపురం జిల్లాలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న స్థలాన్ని తన కుమార్తె పేరిట రాసేందుకు గతంలో స్థిరాస్తి వ్యాపారి అళగప్పన్‌ను సంప్రదించగా.. ఆయన తనను మోసం చేశాడని గౌతమి వెల్లడించింది. అళగప్పన్‌తో పాటు అతడి భార్య, మరికొందరు స్థలాన్ని ఆక్రమించుకున్నారని తెలిపింది. అంతేకాకుండా దీని గురించి ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని, వారిపై చర్చలు తీసుకోవాలని కోరింది. ఈ ఫిర్యాదుపై పోలిసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇక గౌతమి తెలుగు రాష్ట్రానికి చెందిన నటినే. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తన స్వస్థలం. 80, 90ల దశకంలో గౌతమి ఒక సంచలనం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ తీరిక లేకుండా గడిపేది. రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్, అంబరీష్ వంటి స్టార్లతో జత కట్టింది. హీరోయిన్గా రిటైర్మెంట్ తీసుకున్నాక సెకండ్స్ ఇన్నింగ్స్‌లోనూ తల్లి పాత్రలు చేసుకుంటూ యమ బిజీగా గడుపుతుంది. ఇక గౌతమ్ 1998లో సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. కానీ ఏడాది తిరక్కుండానే ఆయనతో విడాకులు తీసుకుంది. వీళ్లకి ఒక కూతురు. ఆ తర్వాత ఐదేళ్లకు కమల్ హాసన్‌తో రిలేషన్లో పడింది. ఏడేళ్లుగా వీరిద్దరు కూడా సెపరేట్‌గా ఉంటున్నారు.