Actress | బండ్లు ఓడలు,ఓడలు బండ్లు అవుతాయనే సామెత మనం తరచూ వింటాం. ఈ సామెతకి తగ్గట్టుగానే కొందరి పరిస్థితులు అలా మారిపోతుంటాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు బాగా వెలిగిన వారు ఆ తర్వాత దారుణమైన పరిస్థితులలో ఉండడం మనం చూశాం. మహానటి సావిత్రితో పాటు ఎందరో నటీనటులు చివరి దశలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా, టీవీ ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి మనం చూడవచ్చు. ఒకప్పుడు వెలుగు వెలిగిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయితే పేరుకు ప్రముఖ నటిగా చెప్పుకొస్తున్న చారు అపోసకి ఇప్పుడు బట్టలు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె ఆర్థిక ఇబ్బందుల కారణంగా నటనకు పూర్తిగా దూరం అయ్యాను అని, ఆన్ లైన్ ద్వారా బట్టల వ్యాపారం చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈమె నార్త్ ఇండియన్ బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితం. ఎన్నో హిందీ సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమెకు వెండి తెరపై కూడా నటించే అవకాశాలు వచ్చిన కొన్ని కారణాల వలన సున్నితంగా తిరస్కరించింది. బాలీవుడ్ స్టార్ నటి సుస్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్‌తో 2019లో చారు అపోస వివాహం జరగగా, వీరి వైవాహిక బంధంలో ఒక పాప కూడా ఉంది.
2021లో పాప జన్మించిన తర్వాత ఇద్దరి మధ్య గొడవలు రావడం జరిగింది. దాంతో 2023లో రాజీవ్ సేన్, చారు అపోసలు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న సమయంలో రాజీవ్ సేన్ భరణంగా కొంత మొత్తం చెల్లించినట్టు సమాచారం. అయితే విడాకుల తర్వాత పాప బాధ్యతకి సంబంధించి కోర్టులో ఇద్దరు పోరాటం చేశారు. చివరకి పాపని చారు అపోస కు కోర్టు అప్పగించిందని తెలుస్తోంది. ఇక ముంబైలో ఖర్చులు ఎక్కువ కాబట్టి అక్కడ ఉండలేక తన సొంత ప్రాంతంకు వెళ్లి పోయింది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని బికనీర్ లో చారు అపోస తన బట్టల వ్యాపారం చేస్తుంది. ఆన్ లైన్ ద్వారా బట్టలు అమ్ముతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె దుస్థితి చూసి కొందరు అయ్యో పాపం అంటున్నారు.