హైదరాబాద్: నగరంలోని హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో ప్రముఖ హెల్త్ అండ్ వెల్నెస్ సంస్థ ‘కలర్స్ హెల్త్‌కేర్’ తన నూతన విభాగం ‘కలర్స్ హెల్త్‌కేర్ 2.0’ను అత్యంత వైభవంగా ప్రారంభించింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ తార కేథరీన్ థెరీసా ముఖ్య అతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కట్ చేయడం ద్వారా కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా కేథరీన్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఇలాంటి కేంద్రాలు ప్రజలకు మరింత చేరువకావడం సంతోషకరమని, అందం మరియు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కలర్స్ హెల్త్‌కేర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆమె కొనియాడారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రస్థానాన్ని ప్రారంభించిన కలర్స్ హెల్త్‌కేర్, గడిచిన 22 ఏళ్లలో లక్షలాది మంది నమ్మకాన్ని గెలుచుకుంటూ నేడు 52 బ్రాంచ్‌లకు విస్తరించిందని తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ సేవలను మరింత మెరుగుపరుస్తూ ‘2.0’ వెర్షన్‌ను పరిచయం చేశామని వివరించారు. ముఖ్యంగా యూఎస్-ఎఫ్‌డీఏ గుర్తింపు పొందిన పరికరాలతో అధిక బరువు, చర్మ మరియు జుట్టు సంబంధిత సమస్యలకు అంతర్జాతీయ స్థాయి చికిత్సలు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమ విజ్ఞప్తిని మన్నించి ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన హీరోయిన్ కేథరీన్ థెరీసాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
5ఎం మీడియా ప్రతినిధి జైదీప్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సంస్థ ప్రతినిధులు మరియు కేథరీన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగర ప్రజలకు అత్యుత్తమ వెల్నెస్ సేవలను అందించడమే లక్ష్యంగా ఈ కొత్త బ్రాంచ్ పనిచేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.