పెగాసిస్ సంస్థ నిర్వహిస్తున్న ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ కాంటెస్ట్ ఫైనల్‌కు ఎంపికైంది సినీ నటి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేరళలోని కొచ్చిలో ఈ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిలించాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంకిత ఠాకూర్, నటి రష్మి ఠాకూర్, తెలంగాణ ఫిలించాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ…‘తెలంగాణ నుంచి ‘మిసెస్ ఇండియా గ్లోబల్’ ఫైనల్స్‌కు చేరుకోవడం సంతోషంగా ఉంది. ఓటింగ్ ద్వారా మీ మద్దతు నాకు తెలుపుతారని ఆశిస్తున్నా’ అని చెప్పింది. ఆర్కే గౌడ్ మాట్లాడుతూ…‘మన దగ్గర నుంచి మిసెస్ ఇండియా గ్లోబల్ కాంటెస్ట్ ఫైనల్స్‌కు చేరిన అంకిత ఠాకూర్‌ను తెలంగాణ ఫిలించాంబర్ తరుపున సపోర్ట్ చేస్తున్నాం. తెలుగు వారంతా ఆమెకు ఓటు వేసి ఫైనల్స్‌లో గెలిపించాలని కోరుతున్నాం’ అన్నారు.