Actors Sivaji And Laya | మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందయ్యా చంద్రం చిత్రాలతో మంచి హిట్ పెయిర్‌గా పేరు గడించిన శివాజీ, లయ చాలా విరామం తర్వాత మళ్లీ హీరోహీరోయిన్లుగా ఓ చిత్రంలో నటిస్తున్నారు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాకు శివాజీ నిర్మాత కూడా కావడం విశేషం. ఆదివారం ఈ సినిమా పూజాకార్యక్రమాలు జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌రాజు క్లాప్ ఇవ్వగా, శివాజీ కుమారుడు రిక్కీ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాతలు బెక్కెం వేణుగోపాల్, దిల్‌రాజు స్క్రిప్ట్‌ని దర్శకుడికి అందజేశారు. తొలి షాట్‌కు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని శివాజీ తెలిపారు.