Actor Venkitesh | విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు మలయాళం నటుడు వెంకిటేశ్. టాలీవుడ్లో చేసింది మొదటి సినిమానే అయిన తెలుగులో తన మొదటి స్పీచ్‌తో అదరగొట్టాడు ఈ కుర్ర హీరో. ఇక కింగ్డమ్ చిత్రంలో వెంకీ విలన్‌గా నటించాడు. మురుగన్ అనే పాత్రలో నటించిన ఇతడు తన నటనతో మంచి మార్కులు సంపాదించాడు. అయితే తన తొలి సినిమాతోనే తెలుగులో ప్రశంసలు అందుకుంటున్న ఈ హీరో కింగ్డమ్ సినిమా చూసి తన అమ్మ గర్వంగా ఫీల్ అయినట్లు చెప్పుకోచ్చాడు. కేరళలోని రెండో పెద్ద థియేటర్లో ఈ సినిమా చూడటానికి అమ్మ వెళ్లింది. థియేటర్లో చాలా వరకు జనాలు వచ్చారని తెలిపింది. ఈ సినిమాలో నన్ను చూసుకోని అమ్మ ఫుల్ హ్యాపిగా ఫీల్ అవ్వడంతో ఏడ్చిందంటూ వెంకి చెప్పుకోచ్చాడు. గౌతమ్ తిన్నన్నూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌తో నడుస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించాడు.