Vikram Movie Pre-Release event | విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం విక్రమ్. మాస్టర్ ఫేం లోకేష్కనగరాజ్ దర్శకత్వం వహించాడు. గతేడాది విడుదలైన టైటిల్ టీజర్ నుంచి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి ప్రేక్షకుల అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. గతకొంత కాలంగా కమల్ నుంచి ఆశించిన స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ క్రమంలో టీజర్, ట్రైలర్లు మళ్ళీ అప్పటి కమల్‌ను గుర్తుచేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్3న విడుదల కానుంది. ఇక విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 31న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకకు ప్రముఖ స్టార్ హీరో గెస్ట్‌గా రాబోతున్నడు.
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో మే 31న జరుగనున్న విక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెంకటేష్ గెస్ట్‌గా రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. వెంకటేష్, కమల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ క్రమంలోనే కమల్ విక్రమ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా పిలిచాడట. వెంకటేష్ కూడా వెంటనే ఓకే చెప్పాడట. ఈ చిత్రంలో మలయాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్, తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. సూర్య గెస్ట్ రోల్లో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతంఅందించాడు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్. మహేంద్రన్‌తో కలిసి కమల్ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
The star studded Prerelease event of @ikamalhaasan's #Vikram is going to be a blast💥
To add the VICTORY VIBE,Our very own @VenkyMama will be gracing the event
⏳Tomorrow 6PM
📍Shilpakala Vedika,Hyd#VikramHitlist @Dir_Lokesh @RKFI @actor_nithiin @SreshthMovies @shreyasgroup pic.twitter.com/FNkljox5zX— Sreshth Movies (@SreshthMovies) May 30, 2022