‘సమంత చాలా అంకితభావం వున్న నటి. పాత్ర కోసం ఎంతో హార్డ్ వర్క్చేస్తారు. వర్క్ విషయంలో చాలా ప్రొఫెషనల్‌గా వుంటారు. ఎప్పుడూ తాను ‘మయోసైటిస్’తో పోరాటం చేస్తున్నానని చెప్పలేదు. ఆమె పోస్ట్ చూసి ఎంతో బాధపడ్డాను. తప్పకుండా ఆమె పూర్తి ఆరోగ్యంతో అతిత్వరలో మన ముందుకు వస్తారు’ అన్నారు నటుడు ఉన్నిముకుందన్. సమంత టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘యశోద’ సినిమాలో ఆయన ఓ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. హరి, హరీష్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది.
ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ “యశోద’ కథ వినగానే వెంటనే ఓకే చెప్పాను. మంచి సినిమా తీశాం. సరోగసి నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సరోగసి అనేది చెప్పడం సులభమే కానీ.. అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్‌గా చూస్తే మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం. ఈ చిత్రంలో సమంతతో కలిసి నటించడం ఆనందంగా వుంది. ఈ చిత్రంలో ఆమె ఎమోషనల్ సీన్స్‌తో పాటు యాక్షన్ ఎపిపోడ్స్ బాగా చేశారు. తప్పకుండా ‘యశోద’ చిత్రం నాకు కూడా మంచి గుర్తింపును తెస్తుంది’ అన్నారు.