Actor Tarun | టాలీవుడ్ నటుడు తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దిగ్గజ నటి రోజా రమణి, నిర్మాత చక్రపాణి దంపతుల కుమారుడైన తరుణ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. బాలనటుడిగా వెండితెరపై తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తరుణ్, చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. తెలుగు, తమిళం, మలయాళం అని తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాతో పాటు వెంకటేశ్ సూర్య ఐపీఎస్ వంటి చిత్రాలు తరుణ్‌కి బాలనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
అయితే బాల నటుడిగానే కాకుండా కొన్ని రోజులు క్రికెటర్‌గా రాణించిన తరుణ్ 2000 సంవత్సరంలో నువ్వేకావాలి చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సాధించడమే కాకుండా టాలీవుడ్లో స్టార్ నటుడిగా ఎదిగాడు. ఆ తర్వాత ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ వంటి సూపర్ హిట్లను అందుకున్నాడు. అయితే కెరీర్లో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలపైనే దృష్టి సారించిన తరుణ్ లవర్ బాయ్‌ని ఇమేజ్‌ని తెచ్చుకోగా.. మాస్లో ఇమేజ్‌లో మాత్రం విఫలమయ్యాడు. దీంతో డిఫరెంట్‌గా ట్రె చేద్దాం అనుకున్న ప్రతిసారి ఆయన పరజయాలు చవిచూశాడు. ఇక చివరిగా ఆయన నటించిన చిత్రం ఇది నా లవ్ స్టోరీ. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టార్ని నమోదు చేసింది. ఇక అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు తరుణ్. ఇక సినిమాలకు దూరమైన తరుణ్ ప్రస్తుతం బిజినెస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.
ఇక సినిమాలు వదిలేసిన తరుణ్ లైఫ్‌లో కూడా ఒక లవ్‌స్టోరీ ఉన్నట్లు తెలుస్తుంది. తరుణ్ నువ్వే కావాలి సినిమా సమయంలో ఒక హీరోయిన్‌తో డేటింగ్లో ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయ. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సన్నిహిత స్నేహం ఏర్పడినట్లు, అది తర్వాత ప్రేమగా మారి విడిపోయే స్థాయికి వచ్చిందని కొన్ని గాసిప్‌లు వచ్చాయి. అయితే, ఈ విషయంపై తరుణ్ లేదా ఆ నటి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమా తర్వాత ఎవరి కెరీర్ వారు చూసుకున్నారని సమాచారం. అయితే తరుణ్ ఆ హీరోయిన్ను మర్చిపోయి ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా కాలం పట్టిందని ఇండస్ట్రీలో టాక్.