Actor Suriya | కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకున్నాడు. నేడు ఉదయం పళనికి వెళ్లిన సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ మురుగన్‌ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకముందు సూర్య రాకతో ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శననంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
రెట్రో సినిమా తర్వాత సూర్య తన తదుపరి చిత్రం వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. ఈ సందర్భంగానే సూర్య స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆలయాన్ని సందర్శించినట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన సూర్య క్లీన్ షేవ్‌లో కనిపించడంతో ఆయన లుక్ వైరల్‌గా మారింది. సూర్య 46 షూటింగ్ జూన్ 9న స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సూర్య సరసన మమితా బైజు కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్ మరియు రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.