Mandaadi Movie | టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ మండాడి(Mandaadi) అనే ఒక తమిళ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తమిళ నటుడు సూరి(Soori) కథానాయకుడిగా రాబోతున్న ఈ చిత్రంలో సుహాస్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం కోలీవుడ్ స్టార్ దర్శకుడు వెట్రిమారన్ నిర్మాణంలో రాబోతుంది. ఇటీవల మూవీ నుంచి సుహాస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయగా.. ఇందులో సుహాస్ వైల్డ్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. వెట్రిమారన్ శైలిలో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా ఇది. తమిళంలో సుహాస్‌కు ఇది మంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమాలో సూరి తమిళంలో మాత్రమే కథానాయకుడిగా నటిస్తున్నాడని.. తెలుగులో హీరోగా సుహాస్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సుహాస్ క్లారిటీ ఇచ్చాడు. మండాడి సినిమాలో తాను విలన్‌గా మాత్రమే నటిస్తున్నట్లు తెలిపాడు.
”అందరికీ నమస్కారం. నా తదుపరి తమిళ చిత్రం మండాడి గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కానీ తెలుగు వెర్షన్లో నేను హీరోగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు అబద్దం. ఈ సినిమాలో నేను కేవలం ప్రతినాయకుడి పాత్రను మాత్రమే పోషిస్తున్నాను. సూరి అన్నయ్య కథానాయకుడిగా నటిస్తున్నారు. అంటూ” సుహాస్ రాసుకోచ్చాడు.
మతిమారన్ పుగళేంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్యరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
Hello. This is a small clarification on my upcoming Tamil film #Mandaadi, which will also have a Telugu release. Unlike all the speculated rumours, I’ll be playing only the Antagonist and Soori anna will be the Protagonist.
— Suhas 📸 (@ActorSuhas) May 6, 2025
Here is the first look of #Mandaadi
Can’t wait to ride and rule the sea with @sooriofficial Anna 🤗🌊@elredkumar @rsinfotainment #VetriMaaran @MathiMaaran @gvprakash @Mahima_Nambiar #Achyuthkumar @RavindraVijay1 #Sathyaraj pic.twitter.com/ZLUSKisaHe
— Suhas 📸 (@ActorSuhas) May 5, 2025