తిరుమల: ప్రముఖ నటుడు శ్రీకాంత్ (Srikanth) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న శ్రీకాంత్.. వీపైపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో శ్రీకాంత్ దంపతులకు వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.