ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు సినీ తారలు సిద్ధార్థ్, అదితిరావు హైదరీ. ఈ నెల 16న వీరిద్దరి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఘనంగా జరిగింది.
వివాహానంతరం ఈ జంట తొలిసారి మీడియా కెమెరాలకు చిక్కారు. ముంబయిలో ఎయిర్పోర్ట్ నుంచి బయటకొస్తూ అభిమానులకు, అక్కడున్న మీడియా వారిని విష్ చేస్తూ ఉల్లాసంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి.