Rashmika Mandanna | రష్మిక డీప్‌ఫేక్ కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video)కు సంబంధించిన కేసులో కీలక నిందితుడిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
Rashmika Mandanna | స్టార్ నటి రష్మిక మందన్నా (Rashmika Mandanna) డీప్‌ఫేక్ వీడియో (Deepfake Video)కు సంబంధించిన కేసులో కీలక నిందితుడిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో డీప్‌ఫేక్ వీడియోని సృష్టించిన ప్రధాన నిందితుడిని (Deepfake Creator Arrested) అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
రష్మికకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో (deepfake video) గతేడాది నవంబర్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్(Zara Patel) అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు (Deepfake Case) దర్యాప్తులో ఢిల్లీ పోలీసులు (Delhi Police) గత నెల నలుగురు నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, నకిలీ వీడియో తయారు చేసింది మాత్రం వీరు కాదని అప్పట్లో వారు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో డీప్‌ఫేక్ వీడియోని సృష్టించినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. మెటా సంస్థ అందించిన వివరాల ఆధారంగా నలుగురు నిందితుల్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఇవాళ తెలిపారు.
Also Read..
Pran Pratishtha | ప్రాణ ప్రతిష్ట రోజున భక్తులకు ప్రసాదంగా.. తెప్లా, మటర్ కచోరీ..
PM Modi | స్టేజ్‌పైకి వెళ్తూ పడిపోబోయిన సీఎం స్టాలిన్.. సాయం చేసిన ప్రధాని మోదీ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Catches Employee With Daughter | ఇంట్లో కుమార్తెతో కలిసి ఉన్న ఉద్యోగి.. బ్యాట్‌తో కొట్టి చంపిన యజమాని
రిమ్స్ బాధిత కుటుంబానికి కేటీఆర్ భరోసా.. రూ.లక్ష ఆర్థిక సాయం అందించిన కోవ లక్ష్మి
GLP-1 Medicine | బరువు తగ్గించే జీఎల్పీ-1 మందులను వాడితే కండరాల నష్టం జరుగుతుందా..? ఏం చేయాలి..?
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

