Animal Park | రణ్‌బీర్ కపూర్‌తో సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కించిన ‘యానిమల్’ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. దాదాపు 900కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టిందా సినిమా. ఈ సినిమా ముగింపులో దీనికి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ రానున్నదంటూ దర్శకుడు వెల్లడించారు. దాంతో సీక్వెల్‌పై ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొన్నది.
తాజాగా ‘యానిమల్ పార్క్’ గురించి నిర్మాత భూషణ్‌కుమార్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘ ‘యానిమల్ పార్క్’ తొలి పార్ట్‌ని మించి ఉంటుంది. ఇందులో బలమైన పాత్రలు ఉంటాయి. ‘యానిమల్’ కంటే ఎక్కువ థ్రిల్‌ను పంచడమే మా ‘యానిమల్ పార్క్’ లక్ష్యం. ప్రస్తుతం సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తవ్వగానే ‘యానిమల్ పార్క్’ మొదలవుతుంది. రానున్న ఆరు నెల్లలో ఈ సినిమా పనులు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తున్నది.’ అని తెలిపారు.