Rana Daggubati | లగేజ్ మిస్ ఘటన.. రానాకు క్షమాపణలు చెప్పిన ఇండిగో..!
Rana Daggubati | టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్ మిస్ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్ మిస్ అయిందని, స్టాఫ్ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదంటూ ఘాటుగా స్పందించారు.
Rana Daggubati | టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటికి ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ తాజాగా క్షమాపణలు చెప్పింది. లగేజ్ మిస్ విషయమై ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థపై రానా ఆసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లగేజ్ మిస్ అయిందని, స్టాఫ్ దాన్ని వెతికిపట్టుకోలేకపోయారని ట్వీట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చెత్త అనుభవం తనకెప్పుడూ ఎదురవలేదంటూ ఘాటుగా స్పందించారు.
కాగా ఈ విషయమై రానాకు ఇండిగో క్షమాపణలు చెప్పింది. ‘సర్, మీ లగేజ్ మీతో పాటు విమానంలో రాకపోవడం వల్ల కలిగిన అసౌకర్యాన్ని మేము అర్థం చేసుకున్నాం. మీకు కలిగిన అసౌకర్యానికి మేము క్షమాపణలు కోరుతున్నాం. మీ లగేజ్ మీకు వీలైనంత త్వరగా అందిస్తామని హామీ ఇస్తున్నాం. ఇందుకోసం మా బృందం పని చేస్తోంది’ అంటూ ఇండిగో సంస్థ ట్వీట్ చేసింది.
Sir, we understand the discomfort when the bag doesn't arrive with you. While we apologise for the inconvenience caused in the meantime, please be assured, our team is actively working to get your luggage delivered to you at the earliest. (1/2)
— IndiGo (@IndiGo6E) December 4, 2022
అసలేమైందంటే…?
ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. విమానాశ్రయంలో చెక్ ఇన్ అయ్యాక బెంగళూరు సర్వీసు ఆలస్యమవుతుంది, మరో విమానంలో వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. లగేజ్ కూడా అదే విమానంలో పంపిస్తామని చెప్పారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజ్ మాత్రం రాలేదు. ఈ విషయమై విమానాశ్రయ సిబ్బందిని రానా ప్రశ్నించారు. వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో అక్కడున్న ఉన్నతాధికారులను నిలదీశారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను టార్గెట్ చేసిన రానా… తాము కల్పించే సదుపాయాలు, రక్షణ గురించి ఇటీవల ఆ సంస్థ చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ పలు వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళతాయో తెలియదు. మిస్సయిన లగేజ్‌ని ఎలా కనుగొనాలో తెలియదు. ఈ విషయాలు సిబ్బందికే తెలియదు’ అంటూ సెటైర్లు వేశారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

