మన హీరోలు పాటలు పాడటం కామనే కానీ..రాయడం మాత్రం అరుదనే చెప్పాలి. తన తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కోసం హీరో రామ్ గీత రచయితగా అవతారమెత్తారు. భావోద్వేగభరితమైన ఓ పాటకు లిరిక్స్ అందించారు. ఈ పాటను స్వరకర్త అనిరుధ్ ఆలపించడం మరో విశేషమని మేకర్స్ తెలిపారు. ‘గీత రచయితగా రామ్ తొలి ప్రయత్నమిది. చక్కటి భావాలు కలబోసి ఆయన అద్భుతమైన పాట రాశాడు. ఈ సాంగ్ విజువల్స్, లొకేషన్స్ అన్నీ మెస్మరైజింగ్‌గా అనిపిస్తాయి.
ఈ నెల 18న ఈ పాటను రిలీజ్ చేయబోతున్నాం’ అని చిత్రబృందం పేర్కొంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్స్, ప్రమోషనల్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. సినిమా హీరో అభిమాని కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీశర్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. వివేక్-మెర్విన్ సంగీతాన్నందిస్తున్నారు.