Sita Ramam Pre-Release Event | ‘మహానటి’ తర్వాత దుల్కర్ నేరుగా తెలుగులో నటించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇప్పటికే 6 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇక మంగళవారం సాయింత్రం 4 గంటలకు ఈ చిత్ర తమిళ ట్రైలర్‌ను హీరో కార్తి విడుదల చేయనున్నాడు. ఇదిలా ఉంటే సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై చివరి వారంలో జరుగునుంది. కాగా ఈ వేడకకు స్టార్ హీరో గెస్ట్‌గా రానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్‌గా రానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక ప్రభాస్ ప్రస్తుతం వైజయంతి బ్యానర్లో ప్రాజెక్ట్-కె చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అశ్వినీదత్, ప్రభాస్‌ను గెస్ట్‌గా పిలిచాడట. ఇక సీతారామం విషయానికొస్తే దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించాడు. మృనాళ్ థాకూర్ సీతామహాలక్మీ పాత్రలో నటించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా కనిపించనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో నటించాడు.
Read Also:
Hari Hara Veera Mallu | పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ మేజర్ అప్డేట్..!
NBK 107 | కర్నూల్లో బాలయ్య అభిమానుల రచ్చ.. వైరల్ అవుతున్న వీడియో
Gargi Movie | బ్లాక్ బాస్టర్ దిశగా ‘గార్గి’.. సాయిపల్లవి క్రేజ్‌తో కలెక్షన్ల సునామీ