Balakrishna-Gopichandh Malineni Movie Shooting | ‘అఖండ’ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి బాలకృష్ణ. అదే జోష్‌తో తన తదుపరి సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ‘క్రాక్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని, బాలకృష్ణతో సినిమా చేయనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా విడుదలవుతుందా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కర్నూల్లో జరుగుతుంది. కాగా బాలయ్యను చూడటానికి కర్నూల్ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముసలావిడ కూడా బాలయ్యను చూడడానికి వచ్చింది. అంతేకాకుండా ఆవిడ ఈలలు గోలలు చేస్తూ బాలకృష్ణపై అభిమానాన్ని చాటుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ చిత్రానికి ‘జై బాలయ్య’, ‘అన్నగారు’ అనే రెండు టైటిల్స్‌ను పరిశీలనలో ఉంచారు. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఎస్ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని ముందుగా దసరా కానుకగా అక్టోబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే షూటింగ్ సమయంలో బాలయ్యకు రెండు సార్లు కరోనా రావడం, ఆయనతో పాటుగా పలువురు క్రూ మెంబర్స్‌కు కూడా కరోనా పాజిటీవ్ రావడం వంటివి చిత్రీకరణకు లేట్ అయింది. ప్రస్తుతం నిర్విరామంగా కర్నూల్ షెడ్యూల్‌ను పూర్తి చేయాలని మేకర్స్ పక్కా ప్లాన్ వేసారట.
Celebrating the shoot of #NBK107 ❤️ pic.twitter.com/mQb0MteeyB
— Mythri Movie Makers (@MythriOfficial) July 26, 2022