హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ‘నీట్-2027’కు సిద్ధమవుతున్న మైనార్టీ విద్యార్థులకు లాంగ్‌టర్మ్ కోచింగ్ ఇస్తున్నట్టు తెలంగాణ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకుబ్‌పాషా తెలిపారు. శిక్షణతోపాటు బోర్డింగ్ ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఎస్సెస్సీ, ఇంటర్ మెమోలు, నీట్-2026 ర్యాంక్ కార్డు లేదా స్కోర్ కార్డును ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలురు tsrjclbnagar @gmail.com, బాలికలు: acadtmrjcboysbarkas @gmail.com ద్వారా నవంబర్ 1లోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు 8520860785 నంబర్లో సంప్రదించాలని సూచించారు.