పెబ్బేరు, అక్టోబర్ 3 : బావిలో నుంచి మోటర్ బయటకు తీసేందుకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన రైతు మండ్ల వెంకటయ్య (50) తన పొలం వద్ద ఉన్న వ్యవసాయ బావిలో మోటర్ పడిపోయింది.
శనివారం మోటార్‌ను బయటకు తీసేందుకు మరొకరి సాయంతో లోపలికి దిగాడు. ఈ క్రమంలో ఆయన కాలు జారి పడటంతో నీటమునిగి మృతి చెందాడు.