Hari Hara Veera Mallu Shooting Update | ఈ ఏడాది ‘భీమ్లానాయక్’తో అభిమానులలో జోష్ నింపాడు పవన్ కళ్యాణ్. రానా కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు. అందులో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మొదటి నుండి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. కరోనా కంటే ముందే షూటింగ్ మొదలైంది. కరోనాతో బ్రేక్ వచ్చింది. అయితే గతేడాది షూటింగ్ ప్రారంభమైనా మళ్ళీ ఏమైందో తెలియదు కాని ఆగిపోయింది. ఇప్పటికే చాలా మంది ఈ సినిమా ఉన్న విషయమే మర్చిపోయారు. నిన్న మొన్నటి వరకు కూడా ఈ సినిమా షూటింగ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్‌పై క్లారిటీ వచ్చింది.
ఈ చిత్ర షూటింగ్ ఆగస్టు నుండి పునఃప్రారంభం కానుంది. షూటింగ్ మొత్తాన్ని నవంబర్ మొదటి వారంలోగా పూర్తి చేసి సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లకు సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసాయి. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అర్జున్ రామ్‌పాల్, నర్గిస్ ఫక్రి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు.