ఫారిన్ ట్రిప్ ముగించుకొని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు ప్రభాస్. అడుగుపెట్టి పెట్టగానే.. ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ పనుల్లో బిజీ అయిపోయారాయన. ప్రభాస్ డబ్బింగ్ పార్ట్ ఈ వారంలో పూర్తవుతుందని ‘ది రాజాసాబ్’ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదల డేట్‌ని కూడా ప్రకటిస్తారట. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలావుంటే.. ‘ది రాజాసాబ్’ డబ్బింగ్ పూర్తి చేసిన వెంటనే హను రాఘవపూడి ‘ఫౌజీ’ సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు ప్రభాస్. 45రోజులపాటు జరిగే ఈ భారీ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారట. దీంతో చాలావరకూ ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తున్నది. ఇమాన్వి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.