Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. గురువారం రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో నాని పవర్‌ప్యాక్డ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
చేతిలో ఆయుధం ధరించి రగ్గ్డ్ లుక్‌లో ఉన్న ఈ పోస్టర్ అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్‌లో నానిని పోలీస్ అధికారి సూర్యగా పరిచయం చేశారు. కేవలం శనివారాల్లో మాత్రమే తన ప్రత్యర్థులను అంతమొందించే వ్యక్తిగా ఆయన పాత్ర కొత్త పంథాలో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రియాంక అరుళ్మోహన్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్నందిస్తున్నారు.