Mammootty Health Update | మలయాళ నటుడు మమ్ముట్టి ఇటీవల ఆరోగ్య సమస్యలతో వార్తలకెక్కారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలియడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యం ఉన్నారు. త్వరలోనూ మూవీ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఈ క్రమంలో నిర్మాతలు జార్జ్, ఆంటో జోసెఫ్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే, మేకప్ మెన్ సైతం ఇన్స్టాగ్రామ్ వేదికగా మమ్ముట్టి ఫొటోతో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. ఈ సందర్భంగా పోస్ట్‌లో ‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కళ్లు ఆనందంతో తడిసిపోయాయి.
నా కోసం ప్రార్థించిన.. నాకు ఏం కాదంటూ ఓదార్చిన వారందరికీ, నాపై అపారమైన ప్రేమను కురిపించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థాంక్యూ’ అంటూ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు యూజర్లు స్పందించారు. లెజెండ్స్ ఎప్పుడూ అలసిపోరని.. వెల్కమ్ బ్యాక్ అంటూ ఓ యూజర్ స్పందించాడు. మరికొందరు యూజర్లు మీరు ఎప్పుడు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నామని.. మరో యూజర్ మరింత బలంగా తిరిగి రావాలని.. మరొకరు కొత్త ఇన్నింగ్స్ మరింత బ్లాస్టింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక మమ్ముట్టి సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా బజూక మూవీలో నటించగా.. ప్రస్తుతం కలాం కావల్, పేట్రియాట్ మూవీల్లో నటిస్తున్నాడు.