ముంబై : నటి మాళవికా రాజ్ (Malvika Raaj), ప్రవీణ్ బగ్గా వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. గోవాలో జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను నటి మాళవిక ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తమ హృదయాలు ప్రేమ, కృతజ్ఞతలతో నిండిపోయాయని ఆమె రాసుకొచ్చారు.
వివాహ వేడుకలో పవన్ అండ్ ప్రణవ్ హౌటె కొచర్ డిజైన్ చేసిన బంగారు వర్ణం లెహంగాలో మాళవికా రాజ్ మెరిసిపోయింది. ప్రణవ్ ఎంబ్రాయిడరీ షేర్వాణిలో హుందాగా కనిపించాడు. ఈ నెల తొలి వారంలో మాళవిక, ప్రవీణ్‌లు ముంబైలో కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ముంబైలో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
ఇక ఈ ఏడాది ఆరంభంలో టర్కీ వేదికగా మాళవిక, ప్రణవ్‌ల నిశ్చితార్ధం జరిగింది. ఇక కభి ఖుషి కభి ఘమ్‌లో చిన్నారి పాత్రలో నటించిన మాళవికా రాజ్ ఆపై యాక్షన్ ఫిల్మ్ స్క్వాడ్‌లో మెరిసింది.
Read More :